ఎంజీఎం హైస్కూల్లో వైభవం గా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
గణపురం, ఆగస్టు 15(అక్షర సవాల్):
చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంజీఎం హైస్కూల్ యందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు చెల్పూర్ బస్టాండ్ వరకు ప్రభాతభేరితో పరేడ్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విశిష్ట అతిధులకు, తల్లిదండ్రులకు ఘన స్వాగతం పలికి వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు,దేశభక్తి పాటలు, నృత్యాలు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో కన్నుల పండుగగా ఆధ్యాంతం అలరించారు.భారత కేంద్ర ప్రభుత్వం దార్శనికత పాలనకు అనుగుణంగా ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ థీమ్ ‘విక్షిత్ భారత్’ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే పరిస్థితులను నెలకొల్పిన తరుణంలో పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం అనేది భారతదేశం గత పోరాటాలను గౌరవించే బహుముఖ వేడుకగా ,భవిష్యత్తు ఆకాంక్షల కోసం జాతీయ స్వేచ్ఛ ఐక్యతను గుర్తుచేస్తూ, పౌరులందరికీ మెరుగైన దేశాన్ని నిర్మించడానికి కొనసాగుతున్న తపనను ప్రతిబింబించే రోజుగా జరుపుకోవడం గర్హనీయం. స్వాతంత్రం పొందినప్పటి నుండి భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ ,అంతరిక్ష అన్వేషణ వంటి రంగాలలో అద్భుతమైన పురోగతిని సాధిస్తుంది. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. యువ పౌరులుగా భారతదేశ అభివృద్ధికి సహకరించడం వలన భారతదేశాన్ని బలంగా, స్వతంత్రంగా ఉంచడానికి మన దేశ సంస్కృతి విలువలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిలువేరు శ్రీనివాస్ ,ప్రిన్సిపల్ మధుకర్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.