Trending Now
Trending Now

ఎంజీఎం హైస్కూల్లో వైభవోపేతంగా బతుకమ్మ పండుగ సంబురాలు

ఎంజీఎం హైస్కూల్లో వైభవోపేతంగా బతుకమ్మ పండుగ సంబురాలు

భూపాలపల్లి, అక్టోబర్ 12(అక్షర సవాల్):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వ పండుగ బతుకమ్మను ఉద్దేశించి శుక్రవారం నుండి 13 రోజుల పాటు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో చెల్పూర్ గ్రామంలోని ఎంజీఎం హైస్కూల్ నందు విద్యార్థినులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మను తయారుచేసి కోలాటాలతో, చప్పట్లతో, ఉయ్యాల పాటలతో ఉపాధ్యాయినిలు విద్యార్థులతో మమేకమై బతుకమ్మ చరిత్రను, ప్రకృతి సౌందర్యాన్ని కీర్తిస్తూ ఉత్సాహం కేరింతలతో, కోలాహలం చేశారు.              ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ ఈ యావత్ ప్రపంచంలో ప్రకృతిని, పూలను ఆరాధించే ఏకైక పండుగను తెలంగాణ ప్రజలు మాత్రమే కలిగి ఉన్నారని ,తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ మరియు ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు ,భక్తి, భయం కలగలిసిన పండుగ అని ఎన్నో శతాబ్దాలుగా ఈ పండుగను భక్తిశ్రద్ధలతో ఆశ్వీయుజ మాసంలో పూలు వికసించి జలవనరులు సమృద్ధిగా పొంగి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబురంగా జరుపుకోబడుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి , గ్యాదంగి రమాదేవి ,సిలువేరు శ్రీనివాస్, ప్రిన్సిపల్ మధుకర్, ఉపాధ్యాయినిలు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు..

Related Articles

Latest Articles