Trending Now
Trending Now

బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న చల్లా

బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న చల్లా

భూపాలపల్లి,జూలై 6(అక్షర సవాల్) :

మహాదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో గ్రామస్థులంతా ఆరాధ్య దైవంగా కొలుచుకునే  భూలక్ష్మి  లక్ష్మి సహిత భువనేశ్వరా (బొడ్రాయి)స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవ కమిటీ సభ్యులకు విరాళాలు అందజేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పీఏసీఎస్ చైర్మన్  చల్లా నారాయణ రెడ్డి. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ…బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవము అనేది మహాలక్ష్మి అంశ అని, బొడ్రాయి అనేది దేవతలకు ప్రతినిధి అని అన్నారు. ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజలందరికీ అవగాహణ కల్పించడం కోసమే ఈ పండుగను చేస్తారని, ప్రతీ ఒక్కరు తమ మత ఆచారాలకు అనుగుణంగా దైవ చింతనను కలిగి ఉండడం వలన మానసిన ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. ఊరిలోని వారంతా కలిసి ఐకమత్యంగా ఉండాలని ఊరు బాగు కోసం ప్రతీ ఒక్కరు ఆలోచించాలనేది దీని వెనుక ఉన్న ప్రధాన ఆంతర్యం అని అన్నారు.సీఎం కేసీఆర్  నాయకత్వంలో రాష్ట్రంలో ఆలయాల పునః ప్రతిష్ట ఏంటో వైభవంగా కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని మతాలకు, కులాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వమే స్వయంగా అన్ని పండుగలను నిర్వహించడం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ కు ఉన్న ప్రేమ అని కొనియాడారు. గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ఉండాలని కోరుకున్నారు..

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్సం సత్య సాగర్, మాజీ ఎంపీటీసీ కిష్టయ్య,ఉప సర్పంచ్ జాడి బుచ్చయ్య,సాగర్, సురేష్, నరేందర్, భాస్కర్, మనోహర్, దుర్గం సురేష్,చిన్నయ్య, వెంకటేశ్వర్లు, రాజేష్, చౌదరి, మల్లేష్, డోలి అర్జయ్య, గోగుల రాజేష్, కాటారం గ్రామ కమిటీ అధ్యక్షులు కొండా రాము, అనుమాల రమేష్, రాజు నాయక్, గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles