నెక్కొండ తండాలో ఆడ శిశువు అమ్మకం..!
వరంగల్, జూలై 1(అక్షర సవాల్ ):
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నెక్కొండ తండాలో ఆడ శిశువు అమ్మకం జరిగినట్లు అధికారులు తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన అనూష స్వామి దంపతులు గత నెల 20 న ప్రసవం కోసం వరంగల్ కేంద్రంలో సికెఎం ఆసుపత్రిలో చేరగా 24వ తేదీన ప్రసవించగా ఆడ శిశువు పుట్టినట్లు తెలిపారు.ఇదివరకు ఇద్దరు ఆడపిల్లలు,ఒక బాబు ఉండటం తో పుట్టిన ఆడ శిశువును పక్కనే చికిత్స కోసం వచ్చిన వారికి సుమారు 50వేలకు ఆమ్మినట్లు అధికారులు తెలిపారు.28న ఆసుపత్రి నుండి రాగ స్థానిక అంగన్వాడీ కార్యకర్త విచారణ చేయగా ఈ విషయం బయటపడ్డట్లు తెలిపారు.సోమవారం ఉన్నతాధికారుల ముందు విక్రయించిన వారిని హాజరు పరుస్తామని తెలిపారు.