ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు : ఎస్పి
భూపాలపల్లి, ఏప్రిల్ 29(అక్షర సవాల్):
ఫిర్యాదులను పెండింగ్లో ఉంచవద్దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పోలిసు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన 11 మంది ఫిర్యాదు దారుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. సివిల్ వివాదాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని, ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సీఐ, ఎస్‌ఐలు పరిశీలించి చట్టపరంగా పరిష్కరించాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికే ప్రజా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పి పేర్కొన్నారు.