Trending Now
Trending Now

గోల్కొండ కోటలో.. నేడు ఆషాడ మాసం నాలుగో బోనం

గోల్కొండ కోటలో నేడు ఆషాడ మాసం నాలుగో బోనం

హైదరాబాద్ :జులై 02(అక్షర సవాల్):ఆషాఢ మాసం గోల్కొండ బోనాలలో నాలుగో బోనం ఆదివారం జరగనున్నది. ఈ నేపథ్యంలో గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వద్ద ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ ఆరెళ్ల జగదీశ్‌ యాదవ్‌, ఈవో శ్రీనివాస రాజులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆదివారం  బోనం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వరకు తొట్టెలలను ఊరేగింపుగా తెస్తారు. లంగర్‌హౌస్‌ నుంచి గోల్కొండ వరకు ఊరేగింపులు ఘనంగా జరుగుతాయి. తొట్టెలను తెచ్చే వారికి స్వాగతం పలకడానికి స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తారు. నాలుగో బోనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చేపట్టనున్నామని దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీకిరణ్ ఖారే ప్రభాకర్‌ తెలిపారు.

తెలంగాణ సంసృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి ,:తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు.  ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, తొమ్మిదేండ్లుగా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. బోనాల ఉత్సవాలకు ఈ ఏడాది రూ.15 కోట్లు కేటాయించారని, ఆ నిధులను సద్వినియోగం చేసుకుని బోనాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం డిప్యూటీ స్పీకర్‌, మంత్రులు, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, తదితరులు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

  • 9న సికింద్రాబాద్‌ మహంకాళి..16న పాతబస్తీ బోనాలు..

ఈ నెల 9న సికింద్రాబాద్‌ మహంకాళి బోనాలు 16న హైదరాబాద్‌ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. ఉత్సవాలకు వారం రోజుల ముందు నుంచే ఆలయాల్లో ఏర్పాట్లకు ప్రత్యేక ఆర్థిక సహాయం చెక్కులు అందజేయాలని అధికారులకు సూచించారు. బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాల వద్ద క్యూలైన్లు, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అమ్మవారి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దాలని, విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలన్నారు. సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి ప్రత్యేక కళా బృందాలతో కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్రీన్‌లతో పాటు లేజర్‌ షో ఏర్పాటు చేయాలని, బోనాలను విశిష్టతను తెలియజేసేలా విసృ్తత ప్రచారం నిర్వహించాలని ఐఅండ్‌పీఆర్‌, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనీల్‌కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, దేవాదాయ, పర్యాటక, సమాచార, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles