జనగర్జన సభకు వెళ్తున్న వాహనాలను అడ్డుకోవడం సరికాదు..
– పోలీసుల తీరుపై జీఎస్సార్ ఆగ్రహం..
– సభకు వెళ్తున్న మా ఎమ్మెల్యే పోదెం వీరయ్య గారిని అరెస్ట్ చేయడం పద్ధతి కాదు..
– బేషరతుగా విడుదల చేయాలని జీఎస్సార్ డిమాండ్..
భద్రాచలం / భూపాలపల్లి, జూన్ 2 ( అక్షర సవాల్ ):
ఖమ్మం పట్టణంలోని వైరా రోడ్డులో ఈరోజు సాయంత్రం నిర్వహించే తెలంగాణ జనగర్జన భారీ బహిరంగ సభకు వెళ్తున్న మా కాంగ్రెస్ నాయకుల వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకోవడం మంచి పద్దతి కాదని జనగర్జన సభ భద్రాచలం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ మేరకు జీఎస్సార్ విలేకరులతో మాట్లాడుతూ.. ఖమ్మం జనగర్జన భారీ బహిరంగ సభకు వస్తున్న అశేష జనాహినిని చూసి, ఓర్వలేకే సిఎం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు జరుగుతున్న పరిణామాలను యావత్తు తెలంగాణ సమాజం గమనిస్తుందని, వచ్చే ఎన్నికల్లో సిఎం కేసీఆర్ కు ప్రజలే బుద్ది చెపుతారని గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సభకు వెళ్తున్న మా భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్యని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం సరైన పద్ధతి జీఎస్సార్ పోలీసులపై ఫైర్ అయ్యారు. వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జనగర్జన సభకు ఎవరెన్ని కుట్రలు చేసినా సభకు పెద్దసంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలివస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తల్లా వాడుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వంపై జీఎస్సార్ ఎద్దేవా చేశారు.