Trending Now
Trending Now

ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్జీఎఫ్ఐ పోటీలలో ఎంజీఎం హై స్కూల్ విద్యార్థుల ఎంపిక

ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్జీఎఫ్ఐ పోటీలలో ఎంజీఎం హై స్కూల్ విద్యార్థుల ఎంపిక 

భూపాలపల్లి, సెప్టెంబర్ 30 (అక్షర సవాల్):

జయశంకర్ భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియం నందు శుక్రవారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంతర్ జిల్లా స్థాయి క్రీడలు కలెక్టర్ భవేష్ మిశ్రా ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు అంతర్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా చెల్పూర్ గ్రామానికి చెందిన ఎంజీఎం హైస్కూల్ విద్యార్థిని ,విద్యార్థులు అండర్ -14 కబడ్డీ విభాగంలో డి. రాహుల్ అండర్ -17 కబడ్డీ విభాగంలో ఇ. దేవేందర్, ఎస్.కె మహబూబ్ హుస్సేన్ అండర్ -17 ఖో ఖో విభాగంలో బి. వర్షిత మరియు ఇ. కార్తీక్ ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ సతీష్ పుష్పగుచ్చం అందజేసి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఈరల్ల మోహన్ ను నిరంతరం విద్యార్థుల్లో దాగిన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి ,విద్యార్థుల్లో చైతన్యం నింపి క్రీడా స్ఫూర్తిని పెంపొందింపజేసి, రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేలా కృషి చేసినందుకు అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి , గ్యాదంగి రమాదేవి , సిలువేరు శ్రీనివాస్ ,ప్రిన్సిపల్ మధుకర్ ,తల్లిదండ్రులు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles