దేవుడిచ్చిన సోదరుడు…..సీఎం రేవంత్ రెడ్డి
ఎంపీ వేం నరేందర్ రెడ్డి
ఢిల్లీలో మరింత రాణించాలి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఇద్దరి శత్రువు ఒక్కరే
రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ
రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ ఘన సన్మానం
పాల్గొన్న ఎంపీ కడియం కావ్య, విప్ రామచంద్రు నాయక్,ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, రేవూరి,గండ్ర సత్య నారాయణ,కడియం శ్రీహరి,ఎమ్మెల్సీ బస్వారాజు
గైర్హాజరైన ఎమ్మెల్యేలు మురళి నాయక్, యశస్విని రెడ్డి,దొంతి మాధవ రెడ్డి
కానరాని పలు జిల్లాల అధ్యక్షులు
కాంగ్రెస్ పార్టీలో ఇంకా వర్గ విభేదాలు
హన్మకొండ,అక్షర సవాల్: హనుమకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ సెంటర్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి కి ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసి అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలిపారు. రాజ్య సభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ “ఓరుగల్లుకు రూ.2200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్, జూలైలో మామునూర్ ఎయిర్‌పోర్ట్ ను ప్రధాని మోడీ తో శంకుస్థాపన చేస్తాం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తల పోరాట ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఓరుగల్లు అభివృద్ధి కోసం రూ.2200 కోట్లతో 11 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, జూలైలో మామునూర్ ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశముందని తెలిపారు. “సీఎం రేవంత్ రెడ్డి నాకు దేవుడు ఇచ్చిన సోదరుడు, ప్రాణ స్నేహితుడు. ఆయన ఇచ్చే ప్రతి ఆదేశాన్ని నమ్మకంగా అమలు చేస్తాను” అని స్పష్టం చేశారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “సీఎం వద్దకు వెళ్లే ముందే చాలామంది వేం వద్దకు వెళతారని సీఎం వద్దకు సమస్యలను చేర్చే ఓ బాంధవుడిగా ఆయన సేవలు ఉంటాయని ఓరుగల్లు బిడ్డగా వేం నరేందర్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో మరింత రాణించాలని ఆకాంక్షించారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి శత్రువు తన శత్రువు ఇద్దరు ఒకటేనని ఆయనే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.రేవంత్ రెడ్డి.. టిడిపిలో ఉన్నప్పుడు దయాకర్ రావు వెన్నుపోటు పొడిచారని, అలాగే వరంగల్ జిల్లాలో కొండా కుటుంబాన్ని తొక్కడానికి ప్రయత్నించాడని ఆ సమయంలో ఇద్దరం దయాకర్ రావు గురించి మాట్లాడుకునే వారు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన విజయానికి వేం నరేందర్ రెడ్డి సలహాలు కీలకమని, రాజ్యసభలో అనర్గళంగా రాణించాలని ప్రశంసించారు.
నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “వేం నరేందర్ రెడ్డి లేకుంటే జిల్లాకు సగం నిధులు కూడా వచ్చేవి కావు – వేం అన్న అందరివాడు” జిల్లా అభివృద్ధిలో వేం నరేందర్ రెడ్డి పాత్ర కీలకమని, ఆయన లేకుంటే నిధులు సగం కూడా రాకపోయేవని కొనియాడారు.
ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. “ఎయిర్‌పోర్ట్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, గ్రేటర్ వరంగల్‌పై వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక దృష్టి” ఓరుగల్లు అభివృద్ధి ప్రాజెక్టులపై వేం నరేందర్ రెడ్డి సమయం కేటాయించి పని చేస్తున్నారని తెలిపారు.
రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డిని సీఎం చేయడంలో వేం నరేందర్ రెడ్డి కీలక పాత్ర” ఉమ్మడి జిల్లాను ఏకతాటిపై నడిపి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకురావడంలో వేం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.
కడియం శ్రీహరి, మాట్లాడుతూ.. “కావ్య రాజకీయ ప్రయాణానికి తొలి అడుగులు వేయించింది వేం నరేందర్ రెడ్డే” తన కుమార్తె కడియం కావ్య ఎంపీగా గెలవడంలో వేం నరేందర్ రెడ్డి సహకారం కీలకమని వెల్లడించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇంకా వర్గ విభేదాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి కి డి కన్వెన్షన్ హాల్లో ఘనంగా సత్కరించారు. ఇట్టి కార్యక్రమానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అలాగే ప్రతి చోట నేను సైతం అంటూ పాల్గొనే ఝాన్సీ రెడ్డి సైతం ఈ సన్మాన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. అలాగే మహబూబాబాద్ జిల్లా నుండి జిల్లా అధ్యక్షులు ఉమా మురళి నాయక్ సైతం హాజరు కాకపోవడంపై సర్వత్ర చర్చ నియాంషంగా మారింది. అలాగే పళ్ళు జిల్లాల అధ్యక్షులు హాజరు కాకపోవడంపై ఇంకా వర్గ విభేదాలు నడుస్తున్నాయా అని అనుమానం కలిగిస్తుంద ని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వo సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, సలహాదారుడుగా ఉన్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. ఏ బదిలీ ఇతర పనులు ఏదున్న… ఆయన కనుసన్నల్లో నడుస్తాయని పలువురు భావిస్తున్నారు. రాబోయే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు తోపాటు కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వర్గ విభేదాలు ఇలాగే కొనసాగుతాయా సద్దుమనుగుతాయా అనేది వేచి చూడాలి.
ఈ కార్యక్రమంలో వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్షులు ఆయుబ్, ఇనగల వెంకట్రాంరెడ్డి, జనగాం జిల్లా అధ్యక్షులు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్, ప్రణాళిక సంఘము ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మేయర్ గుండు సుధారాణి, తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ, స్టేట్స్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖుస్ర్ పాషా, పలు సంస్థల చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు మామిండ్ల రాజు, శ్రీమాన్, వేముల శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

