[pj-news-ticker]
Tuesday, May 19, 2026

Buy now

భవ్య దేవాలయ ప్రారంభోత్సవం

భవ్య దేవాలయ ప్రారంభోత్సవం 

యజ్ఞాలు,ధాన్య జలవాసాలతో ఆధ్యాత్మిక వేడుకలు

నెక్కొండ,మే18 అక్షర సవాల్: గోర్ సిక్వాఢి రాష్ట్రీయ గోర్ సేన ఆధ్వర్యంలో అజ్మీరా మంగ్యా నాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలో భవ్య దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. బావ్ సింగ్ మహరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 50 మంది మాలధారణ స్వాముల సమక్షంలో యజ్ఞాలు నిర్వహించారు. అనంతరం ధాన్యవాసం,జలవాసం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి దేవాలయ పవిత్రతను పెంపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పౌరాదేవి పీఠాధిపతులు కబీర్ దాస్ మహారాజ్,మోతీలాల్ మహారాజ్ హాజరై భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మూడు శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించారు. మంగళవారం గోరై బంజారా ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ,విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బోనం సమర్పణతో ప్రత్యేక వేడుకలు కొనసాగనున్నాయి. అలాగే మేరమాయాడి,సేవాలాల్ మహారాజ్,తపస్వి రాంరావ్ మహారాజ్ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సేవాఘడ్ పీఠాధిపతులు శ్రీ మహారాజ్,బంజారా సాధువులు,గోర్ సిక్వాడి రాష్ట్ర నాయకులు,రాష్ట్రీయ గోర్ సేన జాతీయ నాయకులు హాజరుకానున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు శ్రీనివాస్ నాయక్,వెంకన్న నాయక్ పిలుపునిచ్చారు.

Related Articles

Latest Articles