[pj-news-ticker]
Friday, April 17, 2026

Buy now

వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు

వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు

మేడారం గద్దెలు భక్తజన సంద్రమైంది

గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో వనదేవతలకు ప్రత్యేక పూజలు

మంగపేట/తాడ్వాయి, మార్చి 22, అక్షర సవాల్:

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. సెలవు దినం కావడంతో మేడారం గద్దెలు భక్తజన సంద్రమైంది. కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.భక్తులు గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క, సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్ద రాజులను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి, గంటల తరబడి వేచి చూసి భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

Related Articles

Latest Articles