[pj-news-ticker]
Monday, April 27, 2026

Buy now

ఇంధన కొరతతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి

ఇంధన కొరతతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి

పుకార్లు షికారు చేయడంతో

“నో స్టాక్” బోర్డులు వెలిసాయి

ములుగు/మంగపేట, ఏప్రిల్ 27, అక్షర సవాల్: ఇంధన కొరతతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.పెట్రోల్,డీజిల్ నిల్వలు లేక బంకులు “నో స్టాక్” బోర్డులు పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే పుకార్లు షికారు చేయడంతో ఒక్కసారిగా వినియోగదారులు బంకుల వద్దకు క్యూ కట్టారు. దీంతో బంకుల ముందు “నో స్టాక్” బోర్డులు వెలిసాయి. ఇదిలావుండగా ములుగు జిల్లాలోని చిన్నబోయినపల్లి,ఏటూరునాగారం,కమలాపురం, మంగపేట,రాజుపేట,ఈ బయ్యారం ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి.బంకు నిర్వాహకులు “నో స్టాక్” బోర్డులు పెట్టడంతో వాహనదారులు ఇంధనం లేక వాహనాలు నిలిచిపోవడంతో కార్యాలయాలకు వెళ్లే వారు, అత్యవసర పనుల మీద వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Related Articles

Latest Articles