నలుగురు దొంగలను అరెస్టు చేసిన గీసుగొండ పోలీసులు
గీసుగొండ జులై 18 (అక్షర సవాల్) నిన్న సాయంత్రం గొర్రెకుంట క్రాస్ రోడ్ లో గీసుగొండ యస్.ఐ జాని పాష ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నలుగురు వ్యక్తులు రెండు స్కూటీల పై అనుమానాస్పదంగా ప్రయాణిస్తుండగా పోలీసులు వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు పల్లకొండ ఉపేందర్, పళ్లకొండ వంశీ, పులిచేరి ప్రసాద్, జూలూరి ధనుష్ అందరిది నివాసం కాశీబుగ్గ వీరు గతంలో గొర్రెకుంటలోని టీఎస్.ఎన్.పి. డి. సి.ఎల్. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ షెడ్ లోని కాపర్ వైర్లను, గోపాల్ రెడ్డి నగర్ ఇంటి తాళం పగులగొట్టి డబ్బులను అలాగే హరిహర ఎస్టేట్ లోని అపర్ణ అపార్ట్మెంట్ లో ఇంటి తాళం పగులగొట్టి డబ్బులను దొంగతనం చేసినట్లు వొప్పుకొనగా అట్టి దొంగతనానికి వాడిన స్కూటీ లను సీజ్ చేసి అట్టి దొంగలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి కోర్టు ముందు హాజరు పరుస్తామని గీసుగొండ ఇన్స్పెక్టర్ బాబులాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ ఇన్స్పెక్టర్ బాబులాల్, యస్.ఐ జానిపాష, ఏ.ఎస్.ఐ. సుదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు.