బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకోవాలి : ఎస్పీ
భూపాలపల్లి,మే 6(అక్షర సవాల్):
వివిధ సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించవచ్చని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఎస్పి ప్రజల నుండి 12 ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకుని, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులకు పోలిసు స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు.