బిజెపి పార్టీ కార్యాలయంలో గొడవ…
నర్సంపేట,జూలై 6 (అక్షర సవాల్) :
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి పార్టీ నాయకుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.ప్రధాని మోడీ వరంగల్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎంపి జితేందర్ రెడ్డి రాగ బిజెపి ముఖ్య నాయకులు ఎడ్ల అశోక్ రెడ్డి,రేవూరి ప్రకాశ్ రెడ్డి,రాణా ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు.ఈ క్రమంలో పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదాలు ఒక్కసారిగా బయటపడి కార్యాలయంలో ఉన్న అద్దాలు,కుర్చీలు బద్దలు కొట్టి బాహ బాహి కి దిగిన సంఘటన జరిగింది.మమ్మల్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారనే ఆరోపణలతో రేవూరి ప్రకాశ్ రెడ్డి రాణా ప్రతాప్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ పెట్టుకున్నారు.ఇందుకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.