Trending Now
Sunday, March 23, 2025

Buy now

Trending Now

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన లోక్ సభ పోలింగ్

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన లోక్ సభ పోలింగ్

– పటిష్ట భద్రత నడుమ EVM లు స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు

– జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్పి  కిరణ్ ఖరే 

భూపాలపల్లి, మే 13(అక్షర సవాల్):

జిల్లాలో లోక్ సభ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంతో పాటు, ఘణపురం, రేగొండ, చిట్యాలలోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఎస్పి కిరణ్ ఖరే సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి, పోలింగ్ సరళిని పరిశీలించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలింగ్ కేంద్రాల్లో భద్రత బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలిసు అధికారులు, సిబ్బంది, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, టీఎస్ఎస్పి, శిక్షణ కానిస్టేబుళ్లు, మరియు ఇతర శాఖల సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని అన్నారు.

Related Articles

Latest Articles