అటవీ ప్రాంత ప్రజలకు పోలీసు శాఖ అండగా ఉంటుంది: ఎస్పి
భూపాలపల్లి, ఫిబ్రవరి 8(అక్షర సవాల్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖ నేతృత్వంలో జరిగిన మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. జిల్లా పరిధిలోని పలిమెల, మహా ముత్తారం, భూపాలపల్లి, మండలాల్లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న 6 గొత్తికోయ గుంపుల నుంచి, మరియు అటవీ ప్రాంత గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ అన్నింటి కన్నా ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. హైదరాబాద్ మలక్ పేట యశోద ఆస్పత్రి సౌజన్యంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు ఎస్పి తెలిపారు. మారుమూల ప్రజల ఆరోగ్యం పట్ల పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. గురువారం మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు కు దాదాపు 1000 మంది తరలివచ్చి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారని, మెడిసిన్స్ ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు, ఉచిత బోజన వసతి కల్పించామని, అలాగే చలి తీవ్రతను తట్టుకోవడానికి 100 మంది గుత్తి కోయలకు దుప్పట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇంకా రాబోవు కాలంలో గుత్తి కోయల అభ్యున్నత్తికై అనేక కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున చేపడతామని ఎస్పి కిరణ్ ఖరే తెలిపారు. అటవీ ప్రాంత, గుత్తి కోయల కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ నరేష్ కుమార్, కాటారం డిఎస్పీ జి రామ్మోహన్ రెడ్డి, డిఎంహెచ్వో మధుసూధన్, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది, హైదరాబాద్ మలక్ పేట యశోద హాస్పిటల్స్ డాక్టర్స్ బృందం, ముత్తారం, ఎంపీడీవో జడ్పిటిసి, ఎంపీటీసీ, కాటారం, భూపాలపల్లి, మహాదేవ్ పూర్ సిఐలు అర్జున్ రావు, నరేష్ కుమార్, రాజేశ్వేర్ రావు , భూపాలపల్లి డాక్టర్ లు కిరణ్, శ్రీనివాస్, కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలిసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.