Trending Now
Tuesday, October 29, 2024

Buy now

Trending Now

నీతీశ్ కుమార్ ఇంట్లో విపక్షాల భేటీ

ఇంటర్నేషనల్ (అక్షర సవాల్): 2023-2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా 17 విపక్ష పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి.. పట్నాలో బీజేపీయేతర పార్టీల సమావేశం అనంతరం బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్ కుమార్ ఈమేరకు వెల్లడించారు. శుక్రవారం జరిగిన భేటీ సానుకూల వాతావరణంలో జరిగిందని చెప్పారు. జూ లై 10 లేదా 12న శిమ్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో మరోసారి విపక్షాలు సమావేశం అవుతాయని వెల్లడించారు నీతీశ్.

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా.. విపక్ష నేతల సమావేశం ప్రారంభమైంది. శుక్రవారం బిహార్‌ రాజధాని పట్నాలో ప్రతిపక్ష నేతల భేటీ జరుగింది. బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ చొరవతో జరుగిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(టీఎంసీ), తమిళనాడు సీఎం స్టాలిన్‌ (డీఎంకే), పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (ఆప్‌), ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ (జేఎంఎం) సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన-యూబీటీ), సీపీఎం, సీపీఐ, పీడీపీకి చెందిన నేతలు హాజరయ్యారు.

80 లోక్​సభ సీట్లున్న ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఒక్క సమాజ్‌వాదీ పార్టీ మాత్రమే హాజరుకావడం చర్చనీయాంశమైంది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి ఆహ్వానం పంపలేదు. కుటుంబ కార్యక్రమాల కారణంగా సమావేశానికి తాను హాజరుకావడం లేదని రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత జయంత్‌ చౌధరి తెలిపారు.

Related Articles

Latest Articles