జంపన్న వాగులో ఆటో డ్రైవర్ గల్లంతు: కాపాడిన స్థానికులు
ములుగు , జులై 17 ( అక్షర సవాల్) :
ములుగు జిల్లాలో ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంపనవాగు ఉగ్రరూపం దాల్చింది.. ఉదృతంగా ప్రవహిస్తుంది.. వరద ఉధృతిని అంచనా వేయకుండా లో లెవెల్ కాజ్ వే దాటుతుండగా ఓ ఆటో వాగులో గల్లంతయింది..
వాగులో కొట్టుకుపోయిన ఆటోను స్థానికులు బయట కు తీశారు.. స్థానికుల సహాయంతో ఆటో డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డా డు. ఈ ప్రమాదం ములుగు జిల్లా తాడ్వాయి మండలం చింతల్ క్రాస్ వద్ద జరిగింది..
వినోద్ అనే ఆటో డ్రైవర్ నిత్యవసర వస్తువులు తన ఆటోలో వేసుకొని నార్లా పూర్ వైపు వెళ్తున్నాడు.. ఈ క్రమంలో చింతల్ క్రాస్ వద్ద లో లెవెల్ కాజ్వే దాటుతుం డగా వరద ఉధృతికి ఆటో వాగులో కొట్టుకుపోయింది.
ఆటో వరదలో కొట్టుకపో తుండగా, స్థానికులు గమ నించి ఆటోను బయటకు తీశారు. గల్లంతైన ఆటో డ్రైవర్లు కూడా స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు..జంపన్న వాగు వరద ఉధృతిని అంచనా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు ఉండడం వల్ల ఆటో డ్రైవర్ ప్రాణంతో బయట పడ్డా రు.ఆటోలో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో అంతా ఊపిరిపిల్చు కున్నారు.