తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు
9 జిల్లాలకు కొత్త కలెక్టర్లు
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ ప్రతినిధి, అక్షర సవాల్:
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అవసరాల నిమిత్తం శనివారం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. 9 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, 2 జిల్లాలకు అడిషనల్ కలెక్టర్లను నియమించింది.
కలెక్టర్లుగా బదిలీ అయిన అధికారులు:
భవేష్ మిశ్రా, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ITE&C శాఖ నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ. అభిలాష అభినవ్, స్థానంలో నియామకం.
ప్రియాంక అల,జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ నుంచి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ. హరిచందన దాసరి స్థానంలో నియామకం.
ప్రతీక్ జైన్ నారాయణపేట కలెక్టర్ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ. పి.ప్రావీణ్య స్థానంలో నియామకం.
దివాకర టీఎస్ ములుగు కలెక్టర్ నుంచి ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బదిలీ. అనుదీప్ దురిశెట్టి స్థానంలో నియామకం.
భోర్ఖడే హేమంత్ సహదేవరావు జోనల్ కమిషనర్ జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి నుంచి ములుగు జిల్లా కలెక్టర్‌గా బదిలీ. దివాకర టీఎస్ స్థానంలో నియామకం.
చెక్క ప్రియాంక స్పెషల్ కమిషనర్, I&PR నుంచి నారాయణపేట జిల్లా కలెక్టర్‌గాnబదిలీ. ప్రతీక్ జైన్ స్థానంలో నియామకం.
హేమంత కేశవ్ పాటిల్ జోనల్ కమిషనర్ జీహెచ్ఎంసీ ఎల్.బి.నగర్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ. బాధావత్ సంతోష్, స్థానంలో నియామకం
మంద మకరందు జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ నుంచి పీవో, ఐటీడీఏ, ఉట్నూర్‌గా బదిలీ. ఆదిలాబాద్ కలెక్టర్‌ను ఎఫ్ఏసీ బాధ్యతల నుంచి తొలగించారు.
లెనిన్ వత్సల్ టొప్పో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), మహబూబాబాద్ నుంచి పీవో, ఐటీడీఏ, ఏటూరునాగారంగా బదిలీ. ములుగు కలెక్టర్‌ను ఎఫ్ఏసీ బాధ్యతల నుంచి తొలగించారు.
అడిషనల్ కలెక్టర్లుగా బదిలీ:
కిరణ్మయి కొప్పిశెట్టి సబ్-కలెక్టర్ బాన్సువాడ నుంచి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) రంగారెడ్డి గా బదిలీ.
యువరాజ్ మార్మట్, సబ్-కలెక్టర్, ఉట్నూర్ నుంచి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), కుమ్రంభీం ఆసిఫాబాద్ గా బదిలీ. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

