Trending Now
Tuesday, February 10, 2026

Buy now

Trending Now

రైతులందరికి రుణమాఫీ అమలు చేయాలి

రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలి
  •  గణపురం సొసైటీ లో ఏ ఒక్కరికీ లబ్ది జరుగలేదు
  • పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గణపురం(ము)సొసైటీ మాజీ ఛైర్మన్

భూపాలపల్లి , జులై 20 (అక్షర సవాల్):

షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.  ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ అమలు చేయడంలో పెట్టిన షరతులతో చాలా మంది రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని సొసైటీ లో ఏ ఒక్క రైతుకు రుణమాఫీ జరగలేదని  జిల్లా కలెక్టర్ స్పందించి ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే రాజకీయలు పక్కనపెట్టి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో పోరాడాలని అన్నారు.లేని పక్షంలో ఆగస్టు15 తర్వాత రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

— గత ప్రభుత్వం చేసిన రుణమాఫీని పరిగణలోకి తీసుకోవాలి

గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ ని పరిగణలోనికి తీసుకుంటే సొసైటీ రైతులందరూ అర్హత పొందుతారన్నారు.గత బిఆర్ఎస్  ప్రభుత్వం (కెసిఆర్) అమలు చేసిన రుణమాఫీని పరిగణలోకి తీసుకుంటే 2021-2022 లో సుమారు రెండు కోట్ల రూపాయలు 3 విడుతలుగా మాఫీ జరిగిందని అప్పటికి రెన్యూవల్ అగ్రిమెంట్ అయితే అందరు అర్హత పొందుతారని తెలిపారు.కావున స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి రైతుల పక్షాన కోరారు.

Related Articles

Latest Articles