Trending Now
Tuesday, January 14, 2025

Buy now

Trending Now

హోలీ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి : ఎస్పీ

హోలీ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి : ఎస్పీ

-మద్యం సేవించి వాహనాలు నడపరాదు.

– చెరువుల్లో ,కుంటల్లో స్నానాలు చేయునప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

భూపాలపల్లి, మార్చి 24(అక్షర సవాల్):

జిల్లా ప్రజలు హోలీ పడుగను ప్రశాంతంగా ప్రశాతంగా జరుపుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు పోలీసు శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయాల నడుమ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపడం చేయడం నేరమని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు సురక్షితమైన సహజ రంగులను వాడి పండుగను నిర్వహించుకోవాలని, రసాయన రoగులను ఉపయోగించవద్దని పేర్కొన్నారు. యువత హోలీ పండుగ అనంతరం చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని సూచించారు. ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి సరైన పద్ధతినీ తెలియజేయాలని సూచించారు. వాహనాలు నడిపే క్రమంలో అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ వంటివి మానుకోవాలని, తెలియని వారిపై రంగులు చల్లవద్దని ఎస్పి కిరణ్ ఖరే సూచించారు.

Related Articles

Latest Articles