Trending Now
Trending Now

వరద ముంపు బాధితులను పరామర్శించి దుప్పట్లు పంపిణీ చేసిన భూక్య దేవ్ సింగ్

వరద ముంపు బాధితులను పరామర్శించి దుప్పట్లు పంపిణీ చేసిన  భూక్య దేవ్ సింగ్

ములుగు, ఆగష్టు 10 (అక్షర సవాల్):

ఏటూరునాగారం మండలంలోని దొడ్ల గ్రామంలో ఇటీవల వర్షాలు బీభత్సం సృష్టించడంతో తెలంగాణ రాష్ట్రాన్ని అతలకుతలం చేసిన ఈ వర్షాల విపత్తు వలన పొలాలు రోడ్లు ఇండ్లు రవాణా వ్యవస్థను సైతం ఇబ్బందులకు గురిచేసి ములుగు నియోజకవర్గంలోని గ్రామాల్లో వర్షాలతో ఇల్లు,పంట పొలాల్లో ఇసుకమెటలు వేయడం వల్ల పంటలు పండించుకోవడానికి మరియు వర్షాలతో శిధిలమైన ఇంట్లో ఉండడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని దొడ్ల గ్రామంలో 85 మంది బాధితులకు దుప్పట్లను అందజేస్తూ కొండాయి గ్రామానికి చెందిన 4 కుటుంబంలోని 8 మంది వరదలలో కొట్టుకుపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించిన భూక్య దేవ్ సింగ్.

వరదలలో చనిపోయిన కుటుంబాలకు వెంటనే విపత్తు సహాయం కింద వారికి ఇచ్చే డబ్బులను ములుగు జిల్లాల్లో చనిపోయిన 18 మంది కుటుంబ సభ్యులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని తెలుపుతూ,ఎవరు కూడా అధైర్య పడకూడదని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇలాంటి సంఘటనలు రావడం చాలా దురదృష్టకరమని ఈ వర్షాల వల్ల పెద్ద సంఖ్యలో కుంటలు, చెరువులు,రోడ్లు,గ్రామలు,పట్టణాలు అతలాకుతలం అయి జలదిగ్బంధంలో చిక్కుకుని సర్వం కోల్పోయిన కుటుంబ సభ్యులకు కూలిపోయిన ఇండ్లకు లక్ష రూపాయలు,పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు 50 వేల రూపాయలు,పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు తక్షణమే సహాయం కింద ప్రభుత్వం వెంటనే ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తూ సర్వస్వం కోల్పోయిన వీరికి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఇచ్చి డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలని ఈ వరదల వల్ల చాలా వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున శానిటేషన్,ఫామింగ్,వాటర్ నిల్వ లేకుండా చూడడం,నిల్వ ఉన్న వాటర్ లో ఘంభుజీయా ఫిష్ మరియు ఆయిల్ బాల్స్ వదిలిపెట్టడం,శానిటేషన్ పైన ప్రజలకు అవగాహన కల్పించడం,తక్షణమే నిరుపేద ప్రజలకు దోమతెరలు అందించడం,ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు మస్కిటో కైల్స్ ఇవ్వడం,ములుగు నియోజకవర్గంలో ఈ వరదల ఉధృతి వలన చనిపోయిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని,ఇలాంటి పరిస్థితులు రానున్న కాలంలో పునరావృతం కాకుండా శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకోవాలని రానున్న కాలంలో ఖచ్చితంగా ఎవరైతే గృహాలను కోల్పోయిన కుటుంబాలకు ఇక్కడి పరిస్థితులను ప్రభుత్వానికి చేరవేర్చి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాయం నాగేశ్వరరావు,పాయం వినోద్,రాకేష్,పొదెం ఉమా,పాయంలక్ష్మణరావు,కొమరం సమ్మక్క,పాయం రమేష్,చందా పాపారావు, పల్లెబోయిన పగడయ్య, కాకా భుజంగరావు,కొమరం సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles