అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి…
హైదరాబాద్ జూలై 26 అక్షర సవాల్ : నల్గొండ – అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈరటి మహేష్(24) ఏడాదిన్నరగా అస్సాంలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో అనారోగ్యానికి గురైన మహేష్ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. అస్సాం ప్రభుత్వం మృతదేహాన్ని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తుంది. చిన్న వయసులో మహేష్ మృతి చెందడంతో మదారిగూడెంలో విషాదచాయలు అలుముకున్నాయి.