Monday, May 27, 2024

అధికార పార్టీకి చుట్టం.. ప్రతిపక్షానికి చట్టమా ❓️

అధికార పార్టీకి చుట్టం.. ప్రతిపక్షానికి చట్టమా.. ?

  • బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్

ఖమ్మం జిల్లా :జులై 02(అక్షర సవాల్): 
కాంగ్రెస్ జన గర్జన సభ పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకొని ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు పెట్టింది. ఖమ్మం జిల్లాలో పలు చోట్ల చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి.. వాహనాలను సభకు వెళ్లకుండా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జూలూరుపాడు వద్ద వాహనాలను నిలిపివేసి కేసులు నమోదు చేశారు.

అలాగే నల్గొండ జిల్లా నుంచి కిరాయికి వచ్చిన వాహనాలు నిలిపివేశారు. పత్రాలున్నా కావాలనే కేసులు నమోదు చేస్తూన్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ జన గర్జన సభకు జనం వెళ్లకుండా ప్రభుత్వ పెద్దలు దురుద్దేశ్యంతో వాహనాలను ఆర్టీఏ, పోలీస్ సిబ్బంది అడ్డుకుంటున్నారని పొంగులేటి వర్గం మండిపడుతోంది.

కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘చట్టం మీకు చుట్టమా కేసీఆర్? ఎంతమందిని చంపుతారో చంపండి’ అని అన్నారు. శనివారం ఉదయం నుంచి ఖమ్మం నగరంలో ఆయనను హెచ్చరిస్తూ వెలసిన పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. తనకు కానీ.. తన కార్యకర్తలకు కానీ ఏం జరిగినా కూడా సీఎం కేసీఆర్‌దే బాధ్యత అని అన్నారు.

బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు భయపడేది లేదని పొంగులేటి అన్నారు. తన కార్యకర్తలు ప్రతిఒక్కరినీ కాపాడుకుంటానన్నారు. తన కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ భయపడవద్దన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పోరాడుతానన్నారు. కొంతమంది అధికారులకు చెబుతున్నా.. కావాలంటే మీరు పింక్ కలర్ షర్ట్ వేసుసుకోండని సూచించారు. కొంత మంది అధికారులు రేపు శిక్షకు గురికాక తప్పదని.. తాను న్యాయపోరాటం చేస్తానని.. ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడేదిలేదని పొంగులేటి స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles