Trending Now
Thursday, January 16, 2025

Buy now

Trending Now

క్రీడలలో గెలుపు ఓటములు సహజం

క్రీడలలో గెలుపు ఓటములు సహజం

 

మంగపేట, ఆగస్టు 21 (  అక్షర సవాల్  )  : క్రీడలలో గెలుపు ఓటములు సహజమని ములుగు జిల్లా ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ అన్నారు. మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి ఆధ్వర్యంలో బుధవారం మంగపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన సీఐ అనుముల శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి సీఐ అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల పోటీలలో గెలుపోటములు అవమానంగా , గర్వంగా భావించరాదని, ఓటమి నుంచి మంచి పాఠాలు నేర్చుకుని గెలుపు ద్వారా ఆదర్శవంతమైన జీవితం వైపు అడగులు వేయాలన్నారు. యువత సన్మార్గంలో నడిచి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు. ఈ క్రీడా పోటీలలో మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన టీం  ప్రథమ స్థానం , రాజుపేట గ్రామానికి చెందిన టీం ద్వితీయ స్థానం పొందాయి. క్రీడాపోటీలు అనంతరం విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి , మంగపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది, మండలంలోని పలు గ్రామాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.

 

Related Articles

Latest Articles