[pj-news-ticker]
Tuesday, June 16, 2026

Buy now

వడదెబ్బకు వ్యక్తి మృతి

వడదెబ్బకు వ్యక్తి మృతి 

చంద్రయ్యపల్లిలో విషాద ఛాయలు

గీసుగొండ, అక్షర సవాల్: మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ ఎల్లయ్య వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎల్లయ్య మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాంబయ్య, డైరెక్టర్ ఆకుల రుద్ర ప్రసాద్, ఉప సర్పంచ్ ఐలయ్య, ప్రశాంత్, కరుణాకర్, శివ, గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగారం రవీందర్, గీసుకొండ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles