[pj-news-ticker]
Wednesday, April 15, 2026

Buy now

కొమ్మాలలో శేష వాహన సేవ వైభవం

కొమ్మాలలో శేష వాహన సేవ వైభవం

గీసుగొండ, అక్షర సవాల్:

గీసుగొండ మండలం కొమ్మాలలోని శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శేష వాహన సేవ భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని పుష్పాలంకరణలతో శోభాయమానంగా అలంకరించి శేష వాహనంపై ప్రతిష్ఠించారు. వేదఘోషాలు, మంగళవాయిద్యాల మధ్య గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించగా భక్తులు హారతులు పట్టి దర్శించుకున్నారు. శేష వాహనం ఆదిశేషుని ప్రతీకగా భావిస్తూ భక్తులు ప్రత్యేక విశ్వాసంతో పాల్గొన్నారు. రాత్రివేళ దీపాలంకరణలతో ఆలయం ఆధ్యాత్మిక కాంతిని సంతరించుకుంది. ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీగా హాజరయ్యారు. అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.

 

Related Articles

Latest Articles