Trending Now
Trending Now

సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం : ఎస్పి 

సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే ఐపిఎస్ 

భూపాలపల్లి, అక్టోబర్ 31(అక్షర సవాల్):

స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారత ప్రధమ హోమ్ శాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితం ప్రతి ఒక్కరికీ అదర్శమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే ఐపిఎస్ అన్నారు. మంగళవారం వల్లభాయ్ పటేల్ జయంతి “జాతీయ ఐక్యత దినోత్సవం” ను పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి  జాతీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించి, పటేల్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి, పోలీస్ అధికారులు, సిబ్బందితో ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్ మాట్లాడుతూ పోరాటమే ఊపిరిగా వల్లా భాయ్ పటేల్ ప్రస్థానం కొనసాగిందన్నారు. దేశ సమగ్రత కోసం శ్రమించిన ధీరుడు పటేల్ అని ఎస్పి  తెలిపారు. చిన్నచిన్న రాజ్యాలను దేశంలో విలీనం చేసిన ఘనత ఉక్కుమనిషి సర్దార్ పటేల్ కే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి (ఏఆర్ ) వేముల శ్రీనివాస్, డీఎస్పి నారయణ నాయక్, ఇన్స్పెక్టర్లు వేణుచందర్, సూర్య ప్రకాష్, రామ్ నర్సింహారెడ్డి, రవీందర్, డీపీఓ ఏఓ వసీం ఫర్జానా, సూపరింటెండెంట్ సోఫియా సుల్తానా, సీసీ ప్రదీప్ కుమార్, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Latest Articles