2 కే రన్ లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలి
* మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి
మంగపేట, ఆగస్టు 20 ( అక్షర సవాల్ ) : డ్రగ్స్ నిర్మూలనకై ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో మంగపేట పోలీస్, హోప్ ఎన్జీవో సంస్థ సంయుక్తంగా ఆధ్వర్యంలో ఆగస్టు 29న నిర్వహించనున్న 2 కే రన్ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి పిలుపునిచ్చారు. 2 కె రన్ కార్యక్రమానికి సంభందించిన పోస్టర్లను మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి మంగపేట పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై టీ.వీ.ఆర్.సూరి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ ఉజ్వలమైన భవిష్యత్ కోల్పోతున్నారని అన్నారు. మత్తు పదార్థాలను సేవించడం వలన కలిగే అనర్ధాలపై, ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఆగష్టు 29న మంగపేట మండల కేంద్రంలో నిర్వహించే 2కె రన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టీ షర్టు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్, ప్రథమ, ద్వితీయ బహుమతులు అందించనున్నట్లు ఎస్సై టీ.వీ.ఆర్.సూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో హోప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సయ్యద్ ఖాలీద్, సంస్థ బాధ్యులు సుంకోజు ప్రశాంత్, మినాజ్ హుస్సేన్, సయ్యద్ ఫయాజ్, రహమత్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.