Trending Now
Wednesday, October 30, 2024

Buy now

Trending Now

వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా పేరుతో ఫేక్ మెసేజ్ లు.

వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా పేరుతో ఫేక్ మెసేజ్ లు.

మోసపూరితమైన మెసేజ్ లను నమ్మొద్దు. రెస్పాండ్ కావద్దు.

వెంటనే మెసేజ్ బ్లాక్ చేయండి: కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

వరంగల్, 31 జులై 2024. అక్షర సవాల్: వరంగల్ జిల్లా క‌లెక్ట‌ర్ సత్య శారదా పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నిస్తున్నారు. కలెక్టర్ సత్య శారదా మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డ‌బ్బులు కావాలంటూ +94784977145 శ్రీలంక నంబర్‌ నుంచి ఆ సందేశం పంపిన సబైర్‌ నేరగాడు డబ్బులు ఫోన్‌పే చేసి, స్ర్కీన్‌షాట్‌ షేర్‌ చేయాలని కోరాడు. ప‌లువురికి మేసేజ్‌లు పంపించారు. దీన్ని గ‌మ‌నించిన క‌లెక్ట‌ర్ సత్య శారదా త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న అస‌లు ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అంద‌రిని అప్ర‌మ‌త్తం చేశారు. త‌న పేరుతో ఎవ‌రూ డ‌బ్బులు అడిగిన ఇవ్వొద్ద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. పై నంబర్ మోసపూరితమైనది, దయచేసి జవాబు ఇవ్వకండి. మరియు వీలైనంత త్వరగా బ్లాక్ చేయమని కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ప్రతి ఒక్కరినీ కోరారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ కేటుగాళ్ల ఆటకట్టించేందుకు సిద్ధమయ్యారు.

Related Articles

Latest Articles