[pj-news-ticker]
Sunday, June 14, 2026

Buy now

కావ్య విజయం గ్రామ యువతకు స్ఫూర్తి

కావ్య విజయం గ్రామ యువతకు స్ఫూర్తి 

ఎయిర్ ఫోర్స్ ఎంపిక శాయంపేటకు గర్వకారణం

శుభాకాంక్షలు తెలిపిన గ్రామస్తులు

న్యూ శాయంపేట, జూన్ 14 అక్షర సవాల్: హన్మకొండ నగరం 31 డివిజన్ న్యూ శాయంపేట గ్రామానికి చెందిన వెల్దండి శ్రీధర్ పద్మ కుమార్తె వెల్దండి కావ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా శిక్షణ విజయవంతంగా పూర్తి చేశారు. కఠోర శ్రమ, అంకితభావంతో సాధించిన ఈ విజయం గ్రామ యువతకు స్ఫూర్తిదాయకంగా మారింది.కావ్య విజయాన్ని అభినందించేందుకు శ్రీ రాజరాజేశ్వరి ఆటో యూనియన్ అధ్యక్షులు వేల్పుల సాంబమూర్తి ఆధ్వర్యంలో వెల్దండి రాము, కామగోని బాలకృష్ణ, ఆవునూరి లక్ష్మణ్, మంద రాజు, గోనె శ్యామ్, బొల్లి శ్రీనివాస్, పరికి మధు, ఏ శ్రీనివాస్, టి మహేష్, పి రాకేష్, ఎం అనిల్ తదితరులు కలిసి ఆమెను సన్మానించారు.“కలలు కనడం గొప్ప కాదు, వాటిని నిజం చేయడం గొప్ప. ఆ గొప్పతనాన్ని చాటిన శాయంపేట బిడ్డ కావ్యకు అభినందనలు” అని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడు మామిండ్ల సురేష్ తెలిపారు.

Related Articles

Latest Articles