[pj-news-ticker]
Sunday, April 19, 2026

Buy now

హనుమాన్ అర్ధమండల దీక్షలు ప్రారంభం 

 

హనుమాన్ అర్ధమండల దీక్షలు ప్రారంభం 

వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు

రామనామంతో విజయం సిద్ధిస్తుంది

మంగపేట, ఏప్రిల్18, అక్షర సవాల్: మండలంలోని కమలాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శనివారం శ్రీ రామ బంటు హనుమంతునికి శనివారం అత్యంత ప్రీతికరమైన రోజు ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపరం వంశీ కుమారచార్యులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సుమారు 30 మంది హనుమాన్ భక్తులకు హనుమాన్ మాల ధారణ చేసి అర్ధమండల దీక్షను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు చేసే ప్రతి పనిని రామనామంతో మొదలు పెడితే విజయం తప్పక సిద్ధిస్తుందని అన్నారు. ఆలయ ప్రాంగణం “శ్రీరామ జయ రామ జయ జయ రామ” “శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ” నామాలతో మార్మోగింది.

 

 

 

 

 

Related Articles

Latest Articles