[pj-news-ticker]
Monday, June 1, 2026

Buy now

కొమ్మాల జాతర సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు

కొమ్మాల జాతర సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు

గీసుగొండ, మార్చి 3 అక్షర సవాల్:

కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకుని వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ ఆంక్షలు మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం రాత్రి వరకు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యామ్నాయ మార్గాలు….

 

వరంగల్ నుంచి నర్సంపేట వైపు వెళ్లేవారు:

మచ్చాపూర్ – పల్లరిగూడ – మొండ్రాయి – కొత్తపల్లి – ఉప్పరపల్లి – కోనాపురం – చెన్నారావుపేట గ్రామాల మీదుగా నర్సంపేట చేరుకోవాలి.

నర్సంపేట నుంచి వరంగల్ వైపు వచ్చేవారు:

గిర్నిబావి – నాచనపల్లి – లక్ష్మీపురం – ఎల్కుర్తి – మచ్చాపూర్ మార్గం గుండా వరంగల్ చేరుకోవాలి. జాతర సందర్భంగా పోలీసులు సూచించిన మార్గాలను తప్పనిసరిగా అనుసరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సహకరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. భక్తులు, వాహనదారులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు చేసుకోవాలని పోలీసులు సూచించారు.

Related Articles

Latest Articles