అగ్ని ప్రమాదంలో సుమారు 58 మిర్చి దగ్నం
రైతుకు రూ. 2 లక్షల మేర నష్టం
అగ్నిప్రమాదం ఎలా జరిగింది..?
ములుగు/మంగపేట, ఏప్రిల్ 14, అక్షర సవాల్: నోటి కాడి కూడు బుగ్గిపాలు అన్న సామెత మీరు వినే ఉంటారు. అది అక్షర సత్యం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం వివరాల్లోకి వెళ్తే వెంకటాపురం మండలం బేస్తగూడెం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ రైతు పండించిన మిర్చి పంట కళ్లముందే బూడిదయ్యింది. సుమారు 58 మిర్చి బస్తాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రైతుకు సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని వారి అంచనా…
అగ్నిప్రమాదం ఎలా జరిగింది..?
వివరాల్లోకి వెళ్తే మొక్కజొన్న చేనుకు నిప్పు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పక్కనే రాశిగా పోసి ఉంచిన మిర్చి బస్తాలకు ఈ మంటలు అంటుకోవడంతో నిమిషాల్లోనే అంతా దహనమైపోయింది బాధితుడైన రైతు నవీన్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.
కాలిపోతున్న మిర్చి


