Trending Now
Trending Now

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ఎస్పీ 

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ఎస్పీ 

భూపాలపల్లి, ఫిబ్రవరి 1(అక్షర సవాల్):

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే  గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఆపరేషన్ స్మైల్ -10 కార్యక్రమం జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించడం జరిగిందని, నెల రోజులలో 41 మంది బాల కార్మికులను విముక్తి కల్పించడం జరిగిందని, అందులో 38 మంది బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారని, భూపాలపల్లి సబ్ డివిజన్ పరిధిలో 28 మంది, కాటారం సబ్ డివిజన్ పరిధిలో 13 మొత్తం 41 మంది ఉన్నారని, బాల కార్మికుల యజమానులకు, బాల కార్మికుల తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని ఎస్పి  వెల్లడించారు. జిల్లాలో ఎక్కడయినా బాలకార్మికులుగా పనిచేస్తున్న పిల్లలు ఉన్నట్లయితే అలాంటి వారి ఆచూకీ తెలపాలని, తల్లిదండ్రులు తమ తాత్కాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల భవిష్యత్తును నాశనం చేయరాదని సూచించారు.జిల్లాలో బాలకార్మికులు లేకుండా ప్రజలందరూ సహకారం అందించాలని ఎస్పి  కోరారు. చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి మొహం లో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జిల్లాలో ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న , శారీరకంగా, మానసికంగా మరియు లైంగిక ఇబ్బందులు ఎదుర్కొంటే స్థానిక పోలీసు అధికారులకు గానీ, 1098 లేదా డయల్- 100 ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పి కిరణ్ ఖరే  పేర్కొన్నారు.బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్-10 బృందంలో పని చేసిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని , వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు ఎస్పీ  అభినందనలు తెలిపారు.

Related Articles

Latest Articles