Hyderabad : హైదరాబాద్‌లో వెలుగు చూసిన మరొక భారీ మోసం..
హైదరాబాద్ :జూన్ 29(అక్షర సవాల్): హైదరాబాద్‌లో మరొక భారీ మోసం వెలుగు చూసింది. పన్ను రిఫండ్ కుంభకోణాన్ని ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసింది. 40 కోట్ల రూపాయల స్కామ్‌ని ఐటీ అధికారులు బయటపెట్టారు..
దీనిలో 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్‌లు, రైల్వేలు, పోలీసు శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీల్లో సోదాలు జరిగాయి. ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీలు, వ్యక్తులపై కేసులు నమోదుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
ముందస్తుగా కంపెనీలు, వ్యక్తులకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. అదనపు కన్సల్టెంట్‌లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. నిజాంపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురంలోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ స్కాం లో కన్సల్టెంట్లు, ఉద్యోగులు ఉన్నారని ఐటీ అధికారులు తెలిపారు. కన్సల్టెంట్‌లు, ఏజెంట్ల రీఫండ్ మొత్తంపై 10% కమీషన్ కోసం రిటర్న్‌లను దాఖలు చేశారు. 2017లో సైతం ఐటీ ఇదే తరహా మోసాన్ని గుర్తించింది. 200 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులలో ఉన్న వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రీఫండ్‌లను క్లెయిమ్ చేశారని ఐటీ అధికారులు తెలిపారు..