Trending Now
Wednesday, April 16, 2025

Buy now

Trending Now

యువతే రాజకీయాలను ప్రక్షాళన చేయాలి

రాజకీయాలను ప్రక్షాళన చేయాలి.

— రాజకీయాల్లో నానాటికీ విలువలు పడిపోతున్నాయి..

— రాజకీయాలను గాడిలో పెట్టి సమాజాన్ని బాగు చేయాల్సిన సమయం ఆసన్నమైంది..

— రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ అవగాహన సదస్సులో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ ఎండి రియాజ్ 

భూపాలపల్లి టౌన్, జూన్ 28(అక్షర సవాల్):
యువతే రాజకీయాలను ప్రక్షాళన చేయాలని, అందుకోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ ఎండి రియాజ్  అన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఎన్.ఎస్.యు. ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అధ్యక్షతన రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ పై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ ఎండి రియాజ్* హాజరయ్యారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో నానాటికీ విలువలు పడిపోతున్నాయని, వాటిని గాడిలో పెట్టి సమాజాన్ని బాగు చేయాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకు యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనను తరిమికొట్టడానికి విద్యార్థులు నడుం బిగించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించబోయే రాజీవ్ గాంధీ ఆన్లైన్ కాంపిటీషన్ పోటీలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
అనంతరం రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం బట్టు కరుణాకర్, కాంగ్రెస్ నాయకులు ప్రొఫెసర్ రియాజ్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.
ఈ సమావేశంలో టిపిసిసి సభ్యులు చల్లూరి మధు, దబ్బేట రమేష్, సీనియర్ నాయకులు బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, నగునూరి రజినీకాంత్, యూత్ నాయకులు ప్రేమ్, సురేష్, మహేష్, ఉదయ్, వినయ్, కార్తీక్ తదితరులు ఉన్నారు.

Related Articles

Latest Articles