ప్రేమ పెళ్లి…ఇండ్లను కాల్చింది.
వరంగల్, జూలై5 (అక్షర సవాల్):
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లీ గ్రామంలో ఓ ప్రేమ పెళ్లి ఆ గ్రామంలో వీరంగం సృష్టించింది.గ్రామానికి చెందిన జలిగం రంజిత్ అనే యువకుడు గ్రామానికి చెందిన మండల కావ్య ను ప్రేమ వివాహం ఇటీవల చేసుకున్నారు. ఇది గమనించిన అమ్మాయి తండ్రి తనకు ఉన్న గ్రామంలో పలుకుబడితో గ్రామానికి చెందిన నలుగురి ఇండ్లను ధ్వంసం చేసి అగ్ని రాజేయడంతో ఖాళి దుడిదయ్యాయి.
అబ్బాయి కి సంబంధించిన సన్నిహితుల ఇంటిని పక్క వ్యూహంతో ధ్వంసం చేసి నిప్పు పెట్టినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.