Trending Now
Trending Now

ములుగు జిల్లాలో రోగులను దోచుకునేవారికి ఆప్పన్న* హస్తమా !? అక్షర సవాల్ చేతిలో కీలక ఆధారాలు ?

ములుగు జిల్లా ,అక్షర సవాల్ ,ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో
ప్రైవేట్ ఆసుపత్రుల దందా పై అధికారుల మౌనం లో మర్మమేంటి ..?
— ఓదిక్కు ల్యాబ్ లు, మరో వైపు ప్రైవేట్ ఆసుపత్రులు
— ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీలపై చర్యలేవి..?
— అనుమతులు లేని ల్యాబ్ లను కాపాడుతుంది ఎవరు..?
అక్షర సవాల్ ; తెలంగాణ ప్రత్యేకం , ములుగు జిల్లా , సెప్టెంబర్ 21
ములుగు జిల్లాలో ప్రైవేటు హాస్పిటల్స్ ,ల్యాబ్ లు రోగులను పీల్చి పిప్పి చేస్తున్నా ..అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. వారికి ఆపన్న హస్తం అందిస్తుంది ఎవరన్నా దానిపై జిల్లాలో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేని ప్రవేటు హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని సూచించినా జిల్లా అధికారులు మాత్రం తూతూ మంత్రంగా మాత్రమే చర్యలు చేపడుతూ మెడికల్ మాఫియా కు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు బహిర్గతంగా చర్చించుకుంటున్నారు
ములుగు జిల్లాలో వైద్యం వ్యాపారంగా మారడంతో ఇష్టారీతిగా ప్రవేటు హాస్పిటల్స్,ల్యాబ్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అనుమతులు లేకుండా నడుస్తున్న హాస్పిటల్స్ పై జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేని, నిబంధనలు పాటించని ప్రైవేట్‌ ఆసుపత్రులపై కొరడా ఝళిపిస్తున్నా ములుగు జిల్లాలో మాత్రం అది కనపడటం లేదు. వైద్యం ను వ్యాపార కేంద్రాలుగా మార్చి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి పనిచేస్తున్న అధికారులు మాత్రం వారి ఆటలను కట్టడి చేయలేకపోతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. ఆర్ఎంపీలు ఎంబిబిఎస్ డాక్టర్ల తరహాలో ఆసుపత్రులను ఏర్పాటు చేసి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కనీసం వారిని అరికట్టే నాధుడే కరువయ్యారనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. ప్రధమ చికిత్స చేయవలసిన ఆర్ఎంపీ డాక్టర్లు వారే పట్టా పొందిన డాక్టర్ లు గా రెచ్చిపోతూ ప్రతి జబ్బుకు వైద్యం చేస్తామని చెప్పుతూ
రోగుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు.

 

జిల్లాలోని ఏజెన్సీ మారుమూల గ్రామాలలో ప్రజలను ఆసరాగా చేసుకున్న ఆర్ఎంపీలు ల్యాబ్ నిర్వాహకులతో సంబంధాలను ఏర్పరచుకొని ప్రతి చిన్నదానికి ల్యాబ్ లకు రిఫర్ చేస్తూ పెద్ద మొత్తంలో కమీషన్ ల రూపంలో డబ్బులను దండుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారినపడి ఆర్ఎంపిల వద్దకు వెళ్లగా దానిని ఆసరాగా చేసుకున్న ఆర్ఎంపీలు కాసుల కోసం కక్కుర్తి పడి టెస్టుల పేరుతో ల్యాబ్ లు, ఆస్పత్రులకు రిఫర్ చేస్తూ అమాయక ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలకు సరైన వైద్యం అందక ప్రాణాలను కోల్పోతున్నారు. ఓ పక్క ల్యాబ్ లు మరోవైపు ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయ్
జిల్లాలో విచ్చలవిడిగా ఇంత జరుగుతున్నా కూడా ఆసుపత్రులు ల్యాబ్ లను కట్టడి చేసేవారే కరువయ్యారు. ప్రభుత్వ నిబంధన ఉల్లంఘించి ఎలాంటి అనుమతులు లేకుండా అర్హత లేకున్నా ప్రజలకు వైద్యం చేస్తూ కాసుల కోసం కక్కుర్తి పడుతూ ల్యాబ్ లకు రిఫర్ చేస్తున్నఆర్ ఎంపీ లపై అధికారులు చర్యలు తీసుకుపోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
. జిల్లా వైద్యాధికారులు తెలుపుతున్న వివరాల ప్రకారం జిల్లాలో అనుమతులు ఉన్నవి కొన్ని అయితే అనధికారికంగా నడిచేవే అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఆర్ఎంపీలు సైతం క్లినిక్ లను ఏర్పాటు చేసి ఎంబిబిఎస్, ఫిజీషియన్ తరహాలో వైద్యం పేరుతో నిర్వహణ చేస్తున్న అలాంటి వారిపై చర్యలు లేకపోవడంతో వారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ఇప్పటికే పూర్తి అధరాలు సేకరించిన అక్షర సవాల్ కు ప్రజల తో మమేకంగా ఉన్నతాధికారుల దృష్టికి టుకువెళ్ళనుంది
ఏదైనా ఘటన జరిగినప్పుడే హడావుడి చేసే అధికారులు ఇంత తతంగం జరుగుతున్న పట్టించుకోకవడం పై పలువురు ఆగ్రహం వ్యక్తని చేస్తున్నారు

 

Related Articles

Latest Articles