Trending Now
Trending Now

కష్టపడి పని చేయండి.. గెలిచేది మనమే..గండ్ర

కష్టపడి పని చేయండి.. గెలిచేది మనమే..
– కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి టౌన్, June 26(అక్షర సవాల్):
వచ్చే నాలుగు నెలలు కష్టపడి పని చేయండి.. దేశంలో, రాష్ట్రంలో గెలుపొందేది మనమేనని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి అర్బన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన పట్టణంలోని 30 వార్డులకు చెందిన ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చే అన్ని ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని, వచ్చే నాలుగు నెలలు కష్టపడితే భూపాలపల్లిలో అత్యధిక మెజారిటీతో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని జీఎస్సార్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టించి పని చేసే వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. ఇచ్చిన హామీలను అమలుపరచడంలో పూర్తిగా విఫలం చెందిందని దుయ్యబట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం ప్రగతి సాధించారని దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి అధికారం చేపట్టేందుకు కృషి చేయాలని జీఎస్సార్ దిశా నిర్దేశనం చేశారు.

ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, సీనియర్ నాయకులు బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రెసిడెంట్ బట్టు కరుణాకర్, ఐఎన్టియుసి నాయకులు జోగ బుచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ అర్బన్ వైస్ ప్రెసిడెంట్లు పొనగంటి శ్రీనివాస్, గజవెల్లి అర్జున్, అమ్మనవేణి సంపత్ రావు, కోశాధికారి వెంకీ యాదవ్, బిసి సెల్ అర్బన్ ప్రెసిడెంట్ గురిజాల రవి, ఎస్సీ సెల్ అర్బన్ ప్రెసిడెంట్ బౌతు రమేష్, ప్రధాన కార్యదర్శులు మహేష్ రెడ్డి, స్వామి, భూమయ్య, శ్రీనివాస్, అనిల్ గౌడ్, వెంకన్న, ఖాసిం, సదానందం, నరేష్, సుభాష్, గోపి లతో పాటు 30 వార్డుల ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు ఉన్నారు.

Related Articles

Latest Articles