Trending Now
Trending Now

సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ

సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలి

– జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి

భూపాలపల్లి, జూన్ 26(అక్షర సవాల్): ప్రతి కేసు విషయంలో సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి  అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీపోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల సత్వర పరిష్కారానికి అధికారులందరూ కృషి చేయాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. షీ టీమ్స్ ,సైబర్ క్రైమ్స్, అక్రమ మానవ రవాణా వంటి అంశాలపై అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదిలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు .సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. విధుల పట్ల నిబద్ధతతో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేస్తూ, బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా పని చేయాలని పేర్కొన్నారు. విధులు పట్ల అలసత్వం వహిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పి సురేందర్ రెడ్డి  హెచ్చరించారు. ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి భాదితులకు అండగా నిలవాలని తెలిపారు.

అంతకుముందు ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, న్యాయం చేయవలసిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ వి. శ్రీనివాస్, భూపాలపల్లి, కాటారం, డిఎస్పీలు ఏ. రాములు, జి రామ్మోహన్ రెడ్డి, వర్టికల్ డిఎస్పి కిషోర్ కుమార్, జిల్లా పరిధిలోని సిఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles