ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…భూపాలపల్లి జిల్లా ఎస్పీ
భూపాలపల్లి, జూలై 31(అక్షర సవాల్):
ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి సత్వరంగా పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ అన్నారు. సోమవారం ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితుల నుంచి 14 ఫిర్యాదులు స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల్లో వృద్ధాప్యంలో వారసులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలు ఫిర్యాదు వచ్చాయి,. అదేవిధంగా భూవివాదాలు , కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలు ,భార్యభర్తల సమస్యలపై వచ్చిన బాధితుల ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదులపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.