కోటగుళ్లలో కాటారం డిఎస్పి దంపతుల పూజలు
భుపాలపల్లి , జూన్ 29( అక్షర సవాల్ ):
జయశంకర్ జిల్లా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ల లో గురువారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్ది రజిత దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నరేష్ డిఎస్పి దంపతులను సాధారంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలతో పాటు శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు.