Trending Now
Thursday, April 10, 2025

Buy now

Trending Now

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు … కలిసిపోయారు ( రాజయ్య.. కడియం)

అక్షర సవాల్ ; జనగామ జిల్లా ప్రతినిధి –
స్టేషన్ ఘన్ పూర్ లో మారనున్న సమీకరణాలు

రాజయ్య.. కడియం కలిసిపోయారు

రాజయ్యకు కీలక హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్

కడియం గెలుపు కోసం పని చేస్తానని ప్రకటన

అక్షర సవాల్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది
.బీఆర్ ఎ స్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి సీటు ఖరారు చేయడంతో నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది.
సమయం దొరికిన ప్రతీసారి శ్రీహరిని టార్గెట్ చేస్తూ రాజయ్య సెటైర్లు వేశారు. పరోక్షంగా శ్రీహరిని ఓడిస్తా అనే రేంజ్ వరకు వెళ్లారు. ఈనేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్లో రాజయ్య, శ్రీహరితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో రాజయ్య శాంతించారు. వచ్చే ఎన్నికల్లో కడియం గెలుపునకు పార్టీ కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
మొత్తానికి మంత్రి కె టి ఆర్ వ్యూహం ఫలించి సీవరు ఇద్దరినీ ఒకటి చేసింది …
అయితే ఎన్నికల వరకు ఇదే స్నేహం కొనసాగుతుందా అనేది అందరితో పాటు మనం కూడా వేచి చూడాలి !?

Related Articles

Latest Articles