కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మణీయం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్.
భూపాలపల్లి, సెప్టెంబర్ 27(అక్షర సవాల్):
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీ లేని పోరాటాన్ని నడిపిన కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని, ఆయన బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్ అన్నారు.
బుధవారం జిల్లా పోలీసు కార్యాలయములో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనoగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి కరుణాకర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీనర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారని, తెలంగాణ తొలి తరం, మలి దశ, ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పి వి శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ వసిం ఫర్హానా, భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహరెడ్డి, పోలిసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.