Trending Now
Thursday, January 16, 2025

Buy now

Trending Now

ప్రజల మనిషి పాడి దామోదర్ రెడ్డి

ప్రజల మనిషి పాడి దామోదర్ రెడ్డి

* త్వరలో దామోదర్ రెడ్డి స్మారక క్రీడలు

* జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

 

మంగపేట, ఆగస్టు 18 (  అక్షర సవాల్  )  : ప్రజల మనిషి పాడి దామోదర్ రెడ్డి అని, ఆయన మృతి తీరని లోటు అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు గ్రామం టి.కొత్తగూడెంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాడి దామోదర్ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి దామోదర్ రెడ్డి చిత్రపటానికి నాసిరెడ్డి సాంబశివరెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాసిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ పాడి దామోదర్ రెడ్డి పినపాక, మంగపేట మండలాలకు సుపరిచితుడని టి.కొత్తగూడెం, అకినేపల్లి మల్లారం జంట గ్రామాల అభివృద్ధి కోసం పాడి దామోదర్ రెడ్డి చేసిన కృషి మర్చిపోలేనిదని అన్నారు. త్వరలోనే పాడి దామోదర్ రెడ్డి పేరిట స్మారక క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని సాంబశివరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, నాగిరెడ్డి మైత్రి గ్రూప్స్ చైర్మన్ మైత్రి వెంకటరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ముక్కు సాంబిరెడ్డి, పాడి హేమంత రెడ్డి ,నేలపట్ల శేషారెడ్డి, కన్నెగంటి దుర్గాప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంగళ బుచ్చిరెడ్డి, కందుల రమణారెడ్డి, అప్పినబోయిన నరసింహారావు, పయ్యావుల నరసింహారావు, ఆండ్రు ముద్దుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles