[pj-news-ticker]
Sunday, April 19, 2026

Buy now

నిధుల సమర్థ వినియోగంపై అవగాహన

నిధుల సమర్థ వినియోగంపై అవగాహన 

సర్పంచ్‌లకు స్పష్టమైన మార్గదర్శకాలు

పారదర్శక వినియోగమే లక్ష్యం

గీసుగొండ, ఏప్రిల్ 19 అక్షర సవాల్: గీసుగొండ మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల సమర్థ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి (డిఎల్పిఒ) వేదవతి మేడం సర్పంచ్‌లకు నిధుల వినియోగ విధానంపై సమగ్రంగా వివరించారు. గ్రామ అభివృద్ధి పనుల్లో నిధులను పారదర్శకంగా, నియమ నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయాల్సిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి పాక శ్రీనివాస్ కూడా పాల్గొని గ్రామ స్థాయి అభివృద్ధి పనుల్లో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సర్పంచ్‌లను కోరారు. సమావేశంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ ఆపరేటర్లు పాల్గొని వివిధ అంశాలపై అవగాహన పొందారు.

Related Articles

Latest Articles