జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా తేజావత్ వెంకన్న నియామకం
వరంగల్,26 జూన్, అక్షర సవాల్ :
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం హెచ్ఎండీఏ (HMDA)లో కోర్ అర్బన్ రీజియన్ & మెట్రో రైల్ విభాగం జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న తేజావత్ వెంకన్న ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మున్సిపల్క మిషనర్గా బదిలీ చేస్తూ నియమించింది. ఈ మేరకు ఇప్పటి వరకు జీడబ్ల్యూఎంసీ మున్సిపల్ కమిషనర్ పదవికి అదనపు బాధ్యతలు (FAC) నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయి, ఐఏఎస్ గారిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన కమిషనర్ టి. వెంకన్న త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

