Trending Now
Friday, March 21, 2025

Buy now

Trending Now

నేటినుంచి తెరుచుకోనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు*

*నేటినుంచి తెరుచుకోనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు*

హైదరాబాద్ ,జూన్ 01(అక్షర సవాల్ ):
రాష్ట్రంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం సాయంత్రం తో ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్,పరీక్షలు ముగియడంతోపాటు.. వేసవి సెలవులు కూడా ముగిశాయి. దీంతో రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు నేడు రీఓపెన్ కానున్నాయి.

తెలంగాణలో మొత్తం 3,269 కాలేజీలు ఉండగా, నిన్నటి వరకు 2,483 కళాశాలలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది.

వీటిలో 1,443 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అయితే మిక్స్డ్ ఆక్యుపెన్సి భవనాల్లోని ప్రైవేటు కాలేజీలపై బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

దీంతో ఆయా కాలేజీల్లోని సెకండ్ ఇయర్ విద్యార్థుల భవితవ్యంపై అయోమయం నెలకొంది. అటు పాఠశాలల్లో యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడదంటూ హైదరాబాద్ డీఈఓ ఆదేశాలు ఇచ్చారు.

హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాల ప్రాంగణం లో యూనిఫారాలు, షూ & బెల్ట్ మొదలైనవాటిని విక్రయించ కూడదని.తేల్చి చెప్పేసింది.

కోర్టు ఆదేశాల ప్రకారం, పాఠశాల కౌంటర్‌లో పుస్తకాలు,నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే, వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండా లని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles